రేణుక ఎల్లమ్మ దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి
తెలంగాణ, సిద్దిపేట 13 జూలై (హి.స.) కోరిన మొక్కులను తీర్చే తల్లి రేణుక ఎల్లమ్మ అని, అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల సందర్భంగా ఆదివారం పెద
సిద్దిపేట జిల్లా జడ్జి


తెలంగాణ, సిద్దిపేట 13 జూలై (హి.స.)

కోరిన మొక్కులను తీర్చే తల్లి రేణుక

ఎల్లమ్మ అని, అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల సందర్భంగా ఆదివారం పెద్ద గుండవెల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ...

భక్తితో కొలిచిన భక్తులను అనుగ్రహించే దైవం రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందరూ ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలతో పాడిపంటలతో కళకళలాడుతూ జీవించాలని గ్రామం ఎప్పుడూ కూడా అమ్మ వారి దయతో సుభిక్షంగా ఉంటుందని.. ఆకాంక్షించారు. గర్భగుడిలో అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుందని 20 రోజుల క్రితం అమ్మవారిని దర్శించుకుని కోరిన మొక్కును తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆదివారం నాడు పెద్ద గుండవెల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించుకోవడం జరిగిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande