అమరావతి, 13 జూలై (హి.స.)
: ఏపీ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. ఐదేళ్లపాటు అమలులో ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. స్పేస్ పాలసీ అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అంతరిక్ష ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదారులకు ఈ కార్పొరేషన్ సాయం చేస్తుందని వెల్లడించింది. మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలని.. దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని కార్పొరేషన్‌కు నిర్దేశించింది. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ