అమరావతి, 13 జూలై (హి.స.)ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కోట మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) మృతి పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM YS Jagan) సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘‘ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయనను పద్మశ్రీ తో పాటు ఎన్నో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. కోట మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి