విశాఖలో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయిన బైకులు
విశాఖపట్నం13 జూలై (హి.స.)విశాఖలో వర్షం దంచికొట్టింది. మోస్తరుగా మొదలై ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లు నిలి
విశాఖలో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయిన బైకులు


విశాఖపట్నం13 జూలై (హి.స.)విశాఖలో వర్షం దంచికొట్టింది. మోస్తరుగా మొదలై ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయయి. 16వ వార్డు కేఆర్ఎం కాలనీలో వరద నీరు పోటెత్తింది. దీంతో ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులు ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. బైకులను పట్టుకునే ప్రయత్నం చేసినా వరద దాటికి ఆగలేదు. చాలా దూరం కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande