అమరావతి, 13 జూలై (హి.స.)
రాజధాని అమరావతిలో భూమి లేని నిరుపేదలకు పింఛను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రాజధాని గ్రామాల్లోని 1,575 కుటుంబాలకు పింఛను మాజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పింఛన్నలను రద్దు చేసింది. ఇటీవల జరిగిన భేటీలో పింఛన్ల పునరుద్ధరణకు మంత్రి మందడలి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ఆదేశాలు ఇచ్చారు. రాజధాని నగర నిర్మాణంతో జీవనోసపాధి కోల్పోయిన దృష్ట్యా పింఛను ఇవ్వనుంది. 2015లో జరిపిన ఇంటింటి సర్వే ఆధారంగా 1,575 కుటుంబాలకు పింఛను పునరుద్ధరించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమి లేని వారి జీవనానికి పదేళ్లపాటు ప్రతి నెలా పింఛను సదుపాయాన్ని కల్పించారు. పొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చినందున వారి జీవనానికి ఇబ్బంది లేకుండా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం సీఆర్‌డీఏ పింఛను ఇస్తోంది. ఈ మొత్తం నిరుపేదలకు ఆసరాగా ఉండేది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్లను పెండింగ్‌లో ఉంచారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ పింఛన్లను పునుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా నేలపాడులో ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్పెండింగ్పనులకు ఈ రోజు నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల పెండింగ్పనుల పూర్తికి నిధులు పూర్తి అందజేయనున్నారు. దీనితో పాటు అఖిల భారత సర్వీసుల అధికారుల క్వార్టర్ల పెండింగ్ పనులు కూడా పూర్తి చేయనున్నారు. వీటికి కూడా నిధులు విడుదల చేశారు. మొత్తం రూ.534.70 కోట్ల నిధుల మంజూరుకు పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు సురేష్కుమార్ఆదేశాలు జారీ చేశారు. 18 టవర్లలో 432 అపార్ట్మెంట్యూనిట్ల
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి