Andhra Pradesh, 13 జూలై (హి.స.)టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ తరుణంలో ‘‘ఆయన విలక్షణ నటుడు, మానవతావది. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని వెంకయ్యనాయుడు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి