తెలంగాణ, భూపాలపల్లి.14 జూలై (హి.స.)
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామంలో సోమవారం పరకాల ఆర్టీసీ డీఎం ఇతర అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే జూబ్లీనగర్ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళలకు మహాలక్ష్మీ పేరిట ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. పరకాల టు ములుగు వయా రేగొండ, జూబ్లీనగర్, బండారుపల్లి సర్వీసును అందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బస్సును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ప్రయాణీకులు ఆర్టీసీ డీఎంతో కలిసి జూబ్లీనగర్ నుండి భీమ్ నగర్ తండా మీదుగా కొత్తపల్లి (బీ) వరకు బస్సులో ప్రయాణం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు