కాంగ్రెస్ స‌ర్కార్ అంటేనే క‌ర్ష‌కుల‌ ప్ర‌భుత్వం – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
తెలంగాణ, 14 జూలై (హి.స.) కాంగ్రెస్ సర్కార్ అంటేనే క‌ర్ష‌కుల ప్ర‌భుత్వం అని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఖ‌మ్మం జిల్లాలో పాలేరు జ‌లాశ‌యం నుంచి సాగ‌ర్ ఆయ‌క‌ట్టుకు సోమ‌వారం భ‌ట్టి విక్ర‌మార్క‌తోపాటు రాష్ట్ర రెవెన్యూ, స‌మాచార శాఖ మంత్రి
భట్టి విక్రమార్క


తెలంగాణ, 14 జూలై (హి.స.)

కాంగ్రెస్ సర్కార్ అంటేనే క‌ర్ష‌కుల ప్ర‌భుత్వం అని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఖ‌మ్మం జిల్లాలో పాలేరు జ‌లాశ‌యం నుంచి సాగ‌ర్ ఆయ‌క‌ట్టుకు సోమ‌వారం భ‌ట్టి విక్ర‌మార్క‌తోపాటు రాష్ట్ర రెవెన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి నీరు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే.. వ్యవసాయం, కరెంటు, ప్రాజెక్టులు అని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌రావు అని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande