అమరావతి, 14 జూలై (హి.స.)
తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతి రైల్వే యార్డులోని హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి బోగీ పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని హిసార్ నుంచి హిసార్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్‌కు ఉదయం 11.50కి చేరుకుంది (రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది).
ప్రయాణికులను రైల్వే స్టేషన్‌లో దింపేసిన తర్వాత యార్డులోకి వెళ్తు్న్న క్రమంలో ఇంజిన్ వెనకపైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్‌పై ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ జనరేటర్ బోగీలోకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పివేసేలోగా హిసార్ ఎక్స్‌ప్రెస్ బోగీ పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లోని జనరేటర్ బోగీ పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఆర్‌పీఎఫ్ పోలీసులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ