తాడిపత్రి ,15 జూలై (హి.స.)తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ( మరోసారి తాడిపత్రి ( వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని అక్కడి వైసీపీ ) శ్రేణులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఆ కార్యక్ పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను కోరారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ( )సైతం ఆ జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. కాగా గతంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన క్రమంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆయన్ను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ