కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్
తెలంగాణ, హనుమకొండ 15 జూలై (హి.స.) హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. 30 పడకల దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో ఎలాంటి సౌకర్య
కలెక్టర్ స్నేహ శబరీష్


తెలంగాణ, హనుమకొండ 15 జూలై (హి.స.)

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. 30 పడకల దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

హాస్పిటల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి అప్పయ్య, పలు శాఖల అధికారులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande