మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి : నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
తెలంగాణ, నల్గొండ. 15 జూలై (హి.స.) మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందుకు చిన్న, చిన్న వ్యాపారాలను సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. జిల్లా పర్రిశమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యా
నల్గొండ కలెక్టర్


తెలంగాణ, నల్గొండ. 15 జూలై (హి.స.)

మహిళలు ఆర్థిక సాధికారత

సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందుకు చిన్న, చిన్న వ్యాపారాలను సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. జిల్లా పర్రిశమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, సంస్థల ఏర్పాటుపై స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు నల్లగొండ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రభుత్వం, బ్యాంక్లు చేయూత నిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే ఎక్కువ మందికి సహాయం అందించవచ్చని తెలిపారు. అంతేకాక ఎక్కువ మందికి ఉపాధి సైతం కల్పించవచ్చని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande