ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.. కలెక్టర్ ఆదేశాలు
తెలంగాణ, జోగులాంబ గద్వాల. 15 జూలై (హి.స.) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండలంలోని ఉప్పేరు గ్రామంలో
గద్వాల కలెక్టర్


తెలంగాణ, జోగులాంబ గద్వాల. 15 జూలై (హి.స.)

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య

సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండలంలోని ఉప్పేరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ప్రసవాల రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రిజిస్టరులో సక్రమంగా పూర్తి వివరాలతో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రికి ప్రతి రోజు రోగులు ఎంతమంది వస్తున్నారు, ఇన్ పేషంట్స్ వివరాలను వైద్య సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, విధుల్లో సమయపాలన కచ్చితంగా పాటించాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించి, గర్భిణుల నార్మల్ ప్రసవాలు నిర్వహించి, ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande