వైసిపి ఎమ్మెల్యే అరుణ్ కుమార్ పై కేసు నమోదు
అమరావతి, 15 జూలై (హి.స.) : ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ ) నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను రెచ్
వైసిపి ఎమ్మెల్యే అరుణ్ కుమార్ పై కేసు నమోదు


అమరావతి, 15 జూలై (హి.స.)

: ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ ) నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన ఓ వైసీపీ నాయకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌పై ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈనెల 13న వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా రప్ప రప్ప అంటూ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌ ఆవేశ ప్రసంగాలు చేశారని అక్కడి టీడీపీ ()నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande