తిరుపతి: 15 జూలై (హి.స.)
గోవిందరాజస్వామి, కోదండరామాలయాల్లో రేపు (బుధవారం, జులై 16)న ఆణివార ఆస్థానం( )నిర్వహించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారువాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత గోవిందుడిని వేదిక పైకి తీసుకువచ్చిన తర్వాత ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షిణగా స్వామివారికి సమర్పిస్తారు. కోదండరామాలయంలో గరుడాళ్వార్ అభిముఖంగా సీతాలక్ష్మణ సమేత రాములవారినితీసుకువచ్చిప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం నూతన వస్త్రాలను మూలవరులకు, ఉత్సవ వరులకు అలంకరిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ