విశాఖ.నగరాన్ని వర్షం.ముంచెత్తింది
అమరావతి, 14 జూలై (హి.స.) విశాఖపట్నం: విశాఖనగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు జోరున కురిసిన వర్షానికి కాలువలు,డ్రెయినేజీలు నిండిపోయి వరదలా పారింది.పలుప్రాంతాల్లో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరక
విశాఖ.నగరాన్ని వర్షం.ముంచెత్తింది


అమరావతి, 14 జూలై (హి.స.)

విశాఖపట్నం: విశాఖనగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు జోరున కురిసిన వర్షానికి కాలువలు,డ్రెయినేజీలు నిండిపోయి వరదలా పారింది.పలుప్రాంతాల్లో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం 2గంటలకు ఒక్కసారిగా మేఘాలు కమ్మేసి ఉరుములు, పిడుగులతో భారీవర్షం కురిసింది. రోడ్లపై పార్కుచేసిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. సీతమ్మధారలో 34.0,ధారపాలెంలో 24 మి.మీ. వర్షపాతం నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande