న్యూఢిల్లీ, 14 జూలై (హి.స.)
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దంపతులు కలిశారు. తమ కూతురు పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఆగస్టు 7న జగ్గారెడ్డి కూతురు జయ రెడ్డి వివాహం సంగారెడ్డి లోని రామ్ మందిర్ లో జరుగనున్నది. ఈ మేరకు జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ కు బొట్టు పెట్టి పెళ్లి పత్రికను అందించి ఆహ్వానించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..