రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోయినా రైతు ప‌థ‌కాలు అమ‌లు.. మంత్రి పొంగులేటి
తెలంగాణ, 14 జూలై (హి.స.) రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోయినా రైతు ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ , స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. వారు నేడు ఖమ్మంలో మాట్లాడుతూ.. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు రూ.1
మంత్రి పొంగులేటి


తెలంగాణ, 14 జూలై (హి.స.)

రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోయినా రైతు ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ , స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. వారు నేడు ఖమ్మంలో మాట్లాడుతూ.. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు రూ.12 వేలు అందించామ‌ని గుర్తు చేశారు. వారి ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేశామ‌న్నారు. సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామ‌న్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన పంటలకు కూడా ఇస్తామ‌ని చెప్పారు.ప్రతి హామీని నిలబెట్టుకుంటాం…రాష్ట్రంలో 2,55,324 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ఏడాది కనీవినీ ఎరుగని వరదల కారణంగా సాగర్ మెయిన్ కెనాల్ పూర్తిగా కొట్టుకుపోయిందని.. దానిని పునరుద్ధరించామని తెలిపారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు పూర్తి స్దాయిలో సాగునీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. .

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande