BC Reseబీఆర్ఎస్, బీజేపీలకు మంత్రి పొన్నం హెచ్చరిక
హైదరాబాద్, 14 జూలై (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకే ఆర్డినెన్స్ తీసుకువస్తుంటే కాళ్లలో కట్టెలు పెట్టేలా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కోర్టు ఆదేశాలతో
మంత్రి పున్న


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకే ఆర్డినెన్స్ తీసుకువస్తుంటే కాళ్లలో కట్టెలు పెట్టేలా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కోర్టు ఆదేశాలతో చట్టపరమైన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని కలుగణన నిర్వహించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయబోతున్న చారిత్రాత్మక సందర్భంలో దుర్భుద్దితో ఆలోచించవద్దని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను కోరారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తీసుకురాబోయే ఆర్డినెన్స్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో నిజంగా లక్ష్మణ్ మాట చెల్లుబాటు అయితే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ సంతకంతో రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసి 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని అలాంటి వారికి బీసీలు బుద్ధిచెప్పడం ఖాయం అన్నారు. చట్టంతో పాటు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో బీసీల పట్ల మీకున్న అనుమానాలేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అమలు విషయంలో మరింత మెరుగాగా ఎలా ముందుకు వెళ్లాలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande