అమరావతి, 14 జూలై (హి.స.)
పామర్రు గ్రామీణం, : కృష్ణా జిల్లా పామర్రు మండలం జమీగొల్వేపల్లికి చెందిన కొత్తమిల్లు పుండరీకాక్షయ్య కుమారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ కేఆర్ శేషాద్రిరావు 37 డిగ్రీలు సాధించారు. గ్రామానికి చెంది విశ్రాంత ఐఏఎఫ్ అధికారి, విజయవాడ పోరంకిలో గల విజ్ఞాన్ భారత్ హైస్కూలు అధినేతగా ఉన్న ఈయన.. ప్రస్తుతం దాదాపు తన 78 ఏళ్ల వయసులో ఇప్పటికే 36 డిగ్రీలు సాధించగా.. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో కెనడీ యూనివర్సిటీ నుంచి ‘ఛైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సెలింగ్’ అనే ప్రోగ్రాంపై 37వ డిగ్రీని ఈ నెల 5న దిల్లీలో అందుకున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామమైన జమీగొల్వేపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం శేషాద్రిరావునకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి గ్రామానికి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ