ప్రజావాణితో సమస్యల పరిష్కారం.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 14 జూలై (హి.స.) ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించ
రాజన్న కలెక్టర్


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 14 జూలై (హి.స.)

ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 244 దరఖాస్తులు వచ్చాయి.

అందులో రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 64, డీఆర్డీఓ కు 32, ఉపాధి కల్పన అధికారికి 15, జిల్లా విద్యాధికారికి 11, ఎస్ డీసీ, జిల్లా పంచాయతీ అధికారికి ఏడు చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారికి 6, నీటి పారుదల శాఖకు 4, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 3, ఏడీ మైన్స్, జిల్లా వైద్యాధికారి కి రెండు చొప్పున, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా అటవీ శాఖ, మత్స్య శాఖ, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీఎస్ ఎల్ ఆర్, సీపీఓ, ఈడీఎంకు ఒకటి చొప్పున వచ్చాయి.

ఆయా అర్జీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande