కర్నూల్, 14 జూలై (హి.స.)
విద్యుదాఘాతం తో మరణించిన మహిళ శవంతో ఖమ్మం రూరల్ మండలం కాస్నాతండ గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు మండలంలోని పల్లెగూడెం సబ్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. చనిపోయిన మహిళకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఒక దశలో ఆందోళనకారులు సబ్ స్టేషన్లోకి చొరబడి తలుపులను ధ్వంసం చేశారు. అయితే వారిని పోలీసులు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈ,డిఈల పై చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలోని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం శవంతోనే ఖమ్మం నుండి మహబూబాద్ రహదారిపై ధర్నా చేస్తున్నారు. పోలీసులు ఆందోళన కారులను అదుపు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్