హైదరాబాద్, 14 జూలై (హి.స.)
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ పొలిటికల్ హీట్ గా మారింది. మల్లన్న వ్యాఖ్యలను నిరసనగా నిన్న మల్లన్న కార్యాలయంపై జాగృతి శ్రేణుల దాడి నేపథ్యంలో తాజాగా నందినగర్ లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు భేటీ అయ్యారు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, కవిత అనుచరుల దాడి ఘటన పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కానీ, మల్లన్న కార్యాలయంపై కవిత అనుచరులు దాడి చేసిన అంశంపై కానీ బీఆర్ఎస్ స్పందించలేదు. ఇటీవల బీఆర్ఎస్ తో కవితకు పొసగడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అందువల్లే కవిత విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ ఆసక్తిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..