వివాహేత‌ర సంబంధం.. కాంగ్రెస్ నేత దారుణ హ‌త్య ..
తెలంగాణ, నాగర్ కర్నూల్. 14 జూలై (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేడు ఓ రిజర్వాయర్ లో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. కల్వకోల్ గ్రామానికి చెంది
హత్య


తెలంగాణ, నాగర్ కర్నూల్. 14 జూలై (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేడు ఓ రిజర్వాయర్ లో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. కల్వకోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్నాటి దామోదర్ గౌడ్ (48) రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సింగోటం రిజర్వాయర్ లో నేడు మృతదేహం లభించింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దామోదర్ గౌడ్ కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్ళగా ఆమె భర్త, కొడుకు దాడి చేసి దామోదర్ గౌడ్ ను కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటకట్టి తీసుకెళ్లి ఎంజీకేఎల్ కెనాల్ లో పడేశారు. ప్రస్తుతం ఆ మహిళను, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande