తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 14 జూలై (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తోంది. మండలంలోని రాగట్లపల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్ సోమవారం ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతను ప్రత్యక్షంగా చూశాడు. ఘటనను వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశాడు.
సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత అడుగుజాడలను గుర్తించారు. చిరుత ఆచూకీ కోసం అధికారులు ఎల్లారెడ్డిపేట శివారులతో పాటు వెంకటాపూర్ పరిసర అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటివరకు చిరుత కనిపించకపోవడంతో అప్రమత్తంగా ఉండమని ప్రజలకు సూచించారు. చిరుత సంచార వార్తలతో పంట పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు