సంగారెడ్డి, 14 జూలై (హి.స.)
వ్యాపారులు 120 మైక్రాన్ కంటే తక్కువ కలిగిన ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలువురు వ్యాపారస్తులకు మున్సిపల్ సిబ్బంది నోటీసులను అందజేశారు. ఎవరు కూడా 120 మైక్రాన్ కంటే తక్కువ కలిగిన ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని తెలిపారు. వాడిన ప్లాస్టిక్ కవర్లు కాల్చేయడం చట్ట రీత్యా నేరమన్నారు.
మిగిలిన చెత్తా చెదారం, ప్లాస్టిక్ కవర్లు ఏవి ఉన్నా కూడా చెత్త సేకరించే మున్సిపల్ కార్మికులకు అప్పజెప్పాలని కమిషనర్ సూచించారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారికి 500 నుంచి 5 వేల వరకు జరిమానాలు విధించడం జరుగుతుందని, రెండు రోజుల క్రితం సంగారెడ్డి పట్టణంలోని ముగ్గురు వ్యాపారస్తులకు 4500 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..