స‌రోజా దేవి మృతి.. రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్, 14 జూలై (హి.స.) ప్రముఖ నటి, పద్మభూషణ్ గ్రహీత బి.సరోజా దేవి మరణం పట్ల తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మరిచిపోలేని అనేక పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్న
సరోజా దేవి


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

ప్రముఖ నటి, పద్మభూషణ్ గ్రహీత బి.సరోజా దేవి మరణం పట్ల తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మరిచిపోలేని అనేక పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. చలనచిత్ర రంగంలో వారు లేని లోటు పూడ్చలేనిదని, సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande