రంగారెడ్డి, 14 జూలై (హి.స.) రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలోని శంకర్ పల్లి నుంచి చేవెళ్ల వచ్చే ముంబయి- బెంగుళూరు రోడ్డులో ఎన్నికెపల్లి గేటు వద్ద విద్యార్థులు స్కూల్ లకి కాలేజీలకు వెళ్ళడానికి బస్సుల కోసం రోజు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం బస్సులు సమయానికి రాకపోగా వచ్చిన బస్సులు తను స్టేజి వద్ద ఆపడంలేదని విద్యార్థులు రోడ్డుపై కూర్చొని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు స్పందించి.. మాకు హామీ ఇచ్చేంత వరకు ధర్నా చేస్తామన్నారు. బస్సులు సమయానికి రాక స్కూళ్లలో కాలేజీలలో ప్రిన్సిపాల్లతో రోజు మాటలు పడుతున్నామన్నారు. ముంబయి -బెంగళూరు లింక్ రోడ్డు కావడంతో అటు ఇటు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్