అమరావతి, 14 జూలై (హి.స.)
అమరావతి: గోవా గవర్నర్‌గా నియమితులైన తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. గవర్నర్‌గా ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణమన్నారు. గవర్నర్‌గా అశోక్‌ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్‌గజపతి విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.
అశోక్ గజపతిరాజుకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఆయనకు ఈ గౌరవాన్ని అందించిన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీ, నిబద్ధతతో గవర్నర్ పదవికి అశోక్ గజపతి వన్నె తెస్తారని విశ్వసిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. స్పీకర్ అయన్నపాత్రుడు కూడా అశోక్ గజపతికి శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ