వంద రోజుల ఛాలెంజ్‌ను అధికారులు స్వీకరించాలి: మంత్రి నారా లోకేష్
అమరావతి, 14 జూలై (హి.స.)ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వంద రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ
వంద రోజుల ఛాలెంజ్‌ను అధికారులు స్వీకరించాలి: మంత్రి నారా లోకేష్


అమరావతి, 14 జూలై (హి.స.)ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వంద రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ను నెం.1గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారులు గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఈ కాంపాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande