అమరావతి, 15 జూలై (హి.స.)
విజయవాడ,: మద్యం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. సోమవారం న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ మేరకు తీర్పును వెలువరించారు. సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ