తెలుగు.రాష్ట్రాల.మధ్య నదీ.జలాల హక్కుల. పై వివాదాలు సంస్యక పరిష్కారానికి కేంద్రం సమాయత్తమైంది
అమరావతి, 15 జూలై (హి.స.) , :తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్రం సమాయత్తమైంది. తమ తమ ఎజెండాలతో ఢిల్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ ప
తెలుగు.రాష్ట్రాల.మధ్య నదీ.జలాల హక్కుల. పై వివాదాలు సంస్యక పరిష్కారానికి కేంద్రం సమాయత్తమైంది


అమరావతి, 15 జూలై (హి.స.)

, :తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్రం సమాయత్తమైంది. తమ తమ ఎజెండాలతో ఢిల్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ కోరారు. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు జలశక్తి భవన్‌లో వారిద్దరితో ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు విజయానంద్‌, రామకృష్ణారావులకు జలశక్తిశాఖ నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. రాత్రికి అక్కడే బసచేసి బుధవారం రేవంత్‌రెడ్డితో కలసి సీఆర్‌ పాటిల్‌ను కలుస్తారు. ఈ భేటీలో పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకమే ప్రధానాంశం కానుంది. గోదావరి నుంచి కడలిపాలయ్యే వరద జలాల్లో 200 టీఎంసీలను రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు ఎత్తిపోసి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర జల సంఘానికి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)ను కూడా అందజేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande