కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి..
తెలంగాణ, కరీంనగర్. 15 జూలై (హి.స.) నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం ఏర్పాటుచేసిన కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మానకొండూరు శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాలయంలో వంట మనిషి రేణుక పిల్లలతో పనులు చేయిస్తు
ఎమ్మెల్యే కవ్వంపల్లి


తెలంగాణ, కరీంనగర్. 15 జూలై (హి.స.)

నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల

కోసం ఏర్పాటుచేసిన కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మానకొండూరు శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాలయంలో వంట మనిషి రేణుక పిల్లలతో పనులు చేయిస్తుందని, బూతులు తిడుతుందని పిల్లలు కన్నీటి పర్యంతమవుతూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వంట మనిషిని తొలగించాలని సంబంధిత శాఖ అధికారులను వారు ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాల, కళాశాల విద్యార్థులకు చాక్ పీస్ పట్టి కాసేపు పాఠాలు బోధిస్తూ ప్రశ్నలు అడిగారు.

విద్యార్థులతో నేరుగా బోర్డుపై సబ్జెక్టుకి సంబంధించిన అంశాలను వ్రాయించి,చదివించి నైపుణ్యాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు నామమాత్రపు ప్రతిభ కనబరిచారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలను విద్య పైన వెచ్చిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనాన్ని అందించాలని.. మెనూ పాటిస్తూ ఆహారాన్ని అందించాలని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande