అమరావతి, 15 జూలై (హి.స.)
తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జులై 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం జులై 21వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ-సేవా టికెట్లు పొందిన భక్తులు జులై 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీడిప్ టికెట్ మంజూరు అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ