అమరావతి, 15 జూలై (హి.స.)
,కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే మెగా డీఎస్సీ వచ్చినా ఏపీపీఎస్సీ ద్వారా ఇదే తొలి నోటిఫికేషన్. అటవీ శాఖలో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజాబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్‌ను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు ఈనెల 16 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్పోర్ట్స్ కోటా ఖాళీలు, ఎస్సీ గ్రూపుల వారీగా ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ