కంటోన్మెంట్ను సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం : ఈటల
హైదరాబాద్, 15 జూలై (హి.స.) కంటోన్మెంట్ ను సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మురికి కూపంగా తయారైన రామన్న కుంట చెరువును ఆహ్లదకరంగా.. సేదతీరే విధంగా తయారు చేయబోతున్న
ఈటెల


హైదరాబాద్, 15 జూలై (హి.స.)

కంటోన్మెంట్ ను సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మురికి కూపంగా తయారైన రామన్న కుంట చెరువును ఆహ్లదకరంగా.. సేదతీరే విధంగా తయారు చేయబోతున్నట్లు వివరించారు. మంగళవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.

మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడుతూ..పార్కులు, ఓపెన్ జిమ్ములు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో మంచి ప్రణాళికతో సుందరమైన కంటోన్మెంట్ గా తయారు చేయబోతున్నాం అన్నారు. రాజీవ్ రహదారి, నాగపూర్ హైవే ఫ్లైఓవర్ కింద పోయిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసిందన్నారు. హుస్సేన్ సాగర్ పక్కన ఉండటం వలన కంటోన్మెంట్ లో వర్షం వస్తే ఇళ్లలో పది అడుగులు నీరు చేరుతుందన్నారు. రూ. 303 కోట్లతో కంటోన్మెంట్ లో ఎక్కడ నీరు నిలవకుండా సివరేజ్, నాలాలతో బయటకు పంపించే విధంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించనున్నట్లు తెలిపారు. సీతారామపురం ఏరియాలో అనేక కాలనీలు ఉన్నాయి. ఎప్పుడు వరదలు వచ్చిన మొట్టమొదటి ముంపుకు గురయ్యే ప్రాంతం. దానికి కూడా శాశ్వత పరిష్కారం చేయబోతున్నట్లు ఎంపీ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande