హైదరాబాద్, 15 జూలై (హి.స.)
డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ చీఫ్ రామచందర్రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్రావు లీగల్ నోటీసు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా ఓ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తోందని, దళితులు, ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని వ్యాఖ్యానించారు.
తనను ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా భావించిన రాంచందర్రావు ఐ నోటీసులు జారీ చేసారు. ఈ నోటీసులో భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోహిత్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని, దానికి ఎవరూ ఎవరూ బాధ్యులు కాదని కోర్టులో తేలిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని, దళిత సమాజాన్ని రాజకీయంగా వాడుకునే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని రాంచందర్రావు విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్