హైదరాబాద్, 15 జూలై (హి.స.) హైదరాబాద్లోని మలక్పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం శాలివాహన నగర్లోని పార్క్ వద్ద చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చందూనాయక్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాగా, పార్క్ లో వాకింగ్ చేసుకుంటుంగా ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
సీపీఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు కాపు కాచి హత్య చేశారు. స్నేహితుల తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్ కంట్లో కారం చల్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ ను వెంటాడి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి స్విఫ్ట్ కార్లో పరారయ్యారు.
హత్య కి గల కారణాలు పాతకక్షలు గా ప్రాథమిక అంచనా..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..