న్యూఢిల్లీ, 15 జూలై (హి.స.)
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిసారు. షాంఘై సహకార సంఘం సభ్య దేశాల నేతల్ని కూడా ఆయన కలుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్లో ట్వీట్ చేశారు. భారత్, చైనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సంబంధాల గురించి జీ జిన్పింగు వివరించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి జైశంకర్ చైనాకు వెళ్లారు. సోమవారం చేరుకున్న ఆయన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు హాజరయ్యారు. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయి చర్చలు జరిగాయి. ఎస్సీవోలోని విదేశాంగ మంత్రులతోనూ భేటీ అయినట్లు జైశంకర్ తన ఎక్స్లో పోస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..