ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ భవనానికి బాంబు బెదిరింపు..
హైదరాబాద్, 15 జూలై (హి.స.) ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులకు పాల్పడుతూ ఈమేయిల్స్, కాల్స్ ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది. బీఎస్ఈ భవనంలో బాంబు పెట్టినట్లు అధికారులకు మంగళవారం ఈమెయిల్ వచ్
బాంబు బెదిరింపు..


హైదరాబాద్, 15 జూలై (హి.స.)

ఇటీవల కాలంలో దేశంలో బాంబు

బెదిరింపులకు పాల్పడుతూ ఈమేయిల్స్, కాల్స్ ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది. బీఎస్ఈ భవనంలో బాంబు పెట్టినట్లు అధికారులకు మంగళవారం ఈమెయిల్ వచ్చింది. విచారణ

కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో మెయిల్ వచ్చిందని, అందులో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, ఎటువంటి అనుమానిత వస్తువులు లభించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande