లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు
ముంబయి, , 15 జూలై (హి.స.)దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నేటి ట్రేడింగ్‌లో మన సూచీలు పుంజుకున్నాయి. ఐటీ షేర్లపై విక్రయాల ఒత్తిడి, విదేశ
stock exchange/sensex


ముంబయి, , 15 జూలై (హి.స.)దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నేటి ట్రేడింగ్‌లో మన సూచీలు పుంజుకున్నాయి. ఐటీ షేర్లపై విక్రయాల ఒత్తిడి, విదేశీ మదుపర్ల అమ్మకాల ప్రభావంతో నిన్న మన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దాన్నుంచి నేడు కోలుకున్నాయి.

ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 175 పాయింట్లు పెరిగి 82,425 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు ఎగబాకి 25,140 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.97గా ఉంది. నిఫ్టీ సూచీలో హీరోమోటార్‌కార్ప్‌ లిమిటెడ్‌, గ్రాసిమ్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, శ్రీరామ్ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, టాటా స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ స్టాక్స్‌ నష్టాల్లో కదలాడుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లలో అదే ఒరవడి కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande