ముంబై, 15 జూలై (హి.స.)
ఎయిర్ పోర్టులో రోజువారీగా తనిఖీలు
నిర్వహిస్తుండగా ఓ మహిళ వద్ద రూ.62 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యం అయింది. ఈ షాకింగ్ ఘటన ముంబై ఎయిర్పోర్టులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ముంబై విమానాశ్రయంలో అంతర్జాతీయ దోహా నుంచి ముంబైకి వచ్చిన మహిళ బ్యాగులను చెక్ చేయగా.. ఆరు ఓరియో బాక్సులు, మూడు చాక్లెట్ బాక్సులలో 300 క్యాప్సూల్స్లో తెల్లటి పొడిని దాచి ఉంచింది. దానిని పరీక్షించగా.. హై క్వాలిటీ కొకైన్ గా గుర్తించారు. మొత్తం 6,261 గ్రాముల కొకైన్ దొరకగా.. దాని విలువ 62.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం డ్రగ్స్ను సీజ్ చేసి.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టేన్సెస్ (NDPS) చట్టం, 1985 కింద ఆ మహిళను అరెస్ట్ చేశారు. అలాగే ఆమె ఈ డ్రగ్స్ ను ఎక్కడకి తీసుకెళ్తుంది.. ఎవరితో డీల్ మాట్లాడుకుంది.. అసలు నెట్ వర్క్ ఎక్కడ ఉందనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..