ముంబై, 15 జూలై (హి.స.)
ఎలాన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ “టెస్లా” ఈ రోజు దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూం ఓపెన్ కాబోతోంది. ఈ షోరూంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడల్ Y క్రాస్ఓవర్లను ప్రదర్శించనున్నారు. జూలై చివరి నాటికి న్యూఢిల్లీలో రెండో షోరూం తెరవాలని టెస్లా భావిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో లేదు. లాభాల కన్నా, బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇతర దేశాల నుంచి టెస్లా కార్లను ఇండియాలోకి తీసుకువస్తోంది.
టెస్లా దాని ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, చైనాలో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. కంపెనీ అమ్మకాలు గత త్రైమాసికంలో పడిపోయాయి. అమెరికన్ కంపెనీకి, చైనీస్ కంపెనీ అయిన BYD నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..