స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపాలి: ఎమ్మెల్యే రాందాస్ నాయక్
తెలంగాణ, ఖమ్మం. 15 జూలై (హి.స.) రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. మంగళవారం ఏనుకూర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత
ఎమ్మెల్యే రాందాస్ నాయక్


తెలంగాణ, ఖమ్మం. 15 జూలై (హి.స.)

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో

కాంగ్రెస్ పార్టీ సత్తా చూపాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. మంగళవారం ఏనుకూర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళ వలసిన అవసరం ప్రతి ఒక్క కార్యకర్త పై ఉందన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందన్నారు.

జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande