గోషామహల్, జూబ్లీహిల్స్ ఎక్కడైనా సరే పోటీకి సిద్ధం.. మాధవీ లత
హైదరాబాద్, 15 జూలై (హి.స.) బీజేపీ సపోర్ట్ లేకుండానే మూడు సార్లు రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచాడా అని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ గా ఉన్న రాజాసింగ్ను ఎమ
మాధవీ లత


హైదరాబాద్, 15 జూలై (హి.స.)

బీజేపీ సపోర్ట్ లేకుండానే మూడు సార్లు రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచాడా అని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ గా ఉన్న రాజాసింగ్ను ఎమ్మెల్యేగా చేస్తే.. పార్టీని పట్టుకుని ఏది పడితే అది ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. మహిళలను, ఇతర మతాల వారిని దూషించడమే హిందుత్వమా అని ఫైర్ అయ్యారు.

పార్టీలో తనకు ఎవరూ సహకరించలేదని.. హైదరాబాద్ ఎంపీ ఎన్నికల్లో రాజాసింగ్ తనకు సహకరించకపోవడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఎంపీ అభ్యర్థిగా మగాళ్లే దొరకలేదా అంటూ తనను రాజాసింగ్ హేళన చేశారని గుర్తు చేశారు. కానీ, గోషామహల్లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. మాధవీ లత అంత వీక్ కాదని.. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని పేర్కొన్నారు. గోషామహల్ స్థానంలో తనను రీప్లేస్ చేయాలని రాష్ట్ర అధినాయకత్వం భావిస్తుండటం తన అదృష్టమని తెలిపారు. జూబ్లీహిల్స్, గోషామహల్ ఇలా పార్టీ ఎక్కడ పోటీ చేయమన్నా.. తాను అక్కడ గిరి గీసి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని మాధవీ లత స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande