భూమికి చేరుకున్న‌ శుభాన్షు శుక్లా..
హైదరాబాద్, 15 జూలై (హి.స.) భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్‌ఎస్ ‌(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం భూమికి సుర‌క్షితంగా తిరిగివ‌చ్చారు.. వీరు ప్రయాణ
శుభాన్షు శుక్లా..


హైదరాబాద్, 15 జూలై (హి.స.)

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్‌ఎస్ ‌(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం భూమికి సుర‌క్షితంగా తిరిగివ‌చ్చారు.. వీరు ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్‌ సోమవారం మధ్యాహ్నం 4.45 గంటలకు ఐఎస్‌ఎస్‌తో (ISS) అన్‌డాకింగ్‌ ప్రక్రియ పూర్తిచేసుకుంది. డ్రాగన్‌ గ్రేస్‌ వ్యోమనౌక దాదాపు 22 గంటలపాటు అంతరిక్షంలో ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని సముద్ర జలాలలో దిగింది.ఏడు రోజులు క్వారంటైన్‌..వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత శుభాన్షుతో స‌హా మిగిలిన వారిని ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించారు. ఇస్రో జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande