ఆరు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.
చెన్నై, 15 జూలై (హి.స.)బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, పడమటి గాలుల వేగం కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుండి ఆరు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. 16 నుండి 17 వరకు చెన్నై(Chennai) సహా ఆరుజిల్లాల్లో
Jeep safari in Idukki


చెన్నై, 15 జూలై (హి.స.)బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, పడమటి గాలుల వేగం కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుండి ఆరు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. 16 నుండి 17 వరకు చెన్నై(Chennai) సహా ఆరుజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం సాయంత్రం ఏర్పడిన అల్ప పీడనం ఉత్తర దిశగా కదులుతూ వాయువ్యదిశగా పయనించి సోమవారం వేకువజాము 5.30 గంటలకు వాయుగుండంగా మారి బంగ్లాదేశ్‌ సమీపంలో కేంద్రీకృతమైంది.

కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కి.మీ.ల వేగంతో గాలులు వీచాయి. దీంతో నీలగిరి జిల్లాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు సహా 6 జిల్లాల్లో ఈ నెల 16 నుండి 17 వరకు కుండపోతగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రతీర ప్రాంతాల నుండి రాష్ట్రం వైపు వీచే పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా మంగళవారం నుండి పలు చోట్ల చెదురుమదురుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande