హిందీ భాష పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హిందీ భాష పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హిందీ భాష పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


అమరావతి, 15 జూలై (హి.స.) ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) ఇటీవల హిందీ(Hindi) భాష పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ విద్యా,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) హిందీ భాష పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. హిందీని జాతీయ భాషగా పేర్కొన్నారు. అయితే యాంకర్ హిందీ జాతీయ భాష కాదు అని చెప్పగా.. మనం హిందీ ఎందుకు నేర్చుకోకూడదు? జాతీయ భాషగా హిందీని ఎందుకు ముందుకు తీసుకెళ్లకూడదు? అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఇంగ్లీష్ లాగే హిందీ కూడా లింక్ లాంగ్వేజ్ అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హిందీ భాష పెద్దమ్మ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ హిందీ భాష పై చేసిన వ్యాఖ్యల పై సామాజిక మాధ్యమా(Social Media)ల్లో చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande