హైదరాబాద్, 16 జూలై (హి.స.)
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీల పరిష్కారానికి ఢిల్లీ కేంద్రం అయింది. ఇరు రాష్ట్ర సీఎంలు, అధికారులతో చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ మధ్య బనకచర్ల, కృష్ణ నది జలాల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో పర్యటిస్తుండటంతో.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను కేంద్రం పరిష్కరించాలని సూచించారు. అలాగే నీటి పంపిణీ గురించి చర్చలు జరపకుండా.. ప్రాజెక్ట్లపై చర్చ జరిగితే నష్టం జరుగుతుందని, మిగులు జలాలను ఎంత వాడుకోవాలన్నదానిపై.. ముందుగా ఇద్దరు సీఎంలు చర్చించాలని.. నీటి వాటా తేల్చకుండా ప్రాజెక్ట్లను కట్టుకుంటాం.. అనుమతులు తెచ్చుకుంటామంటే సమస్య పరిష్కారం కాదని ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పుకొచ్చాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్