అమరావతి, 16 జూలై (హి.స.)
: విజయవాడ లో జంటహత్యలు కలకలం రేపాయి. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం వచ్చి అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అద్దె గదుల్లో ఉంటున్నట్లు సమాచారం. హత్యల గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు క్లూస్‌టీమ్‌తో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరు యువకులను ఓ రౌడీషీటర్ కత్తితో పొడిచి హతమార్చినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ